బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 జనవరి 2022 (11:04 IST)

రామ్ చరణ్ - శంకర్ సినిమా అప్డేట్... ఏంటంటే...

క్రియేటివ్ దర్శకుడు ఎస్.శంకర్ - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్‌ కోసం సమాయత్తమవుతుంది. 
 
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం గురించి తాజా అప్‌డేట్స్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. వచ్చే యేడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉంటుందని, ఆ సంక్రాంతి మనదేనంటూ ప్రకటించారు. అంటే 2023 సంక్రాంతి బరిలో శంకర్ - చెర్రీల చిత్రం విడుదల కావడం ఖాయమని తేలిపోయింది. 
 
కాగా, రాజమౌళి దర్శకత్వంలో రాం చరణ్, ఎన్టీఆర్‌లు నటించిన ప్రతిష్టాత్మక "ఆర్ఆర్ఆర్" చిత్రం వివిధ కారణాల రీత్యా ఏప్రిల్ తొమ్మిదో తేదీకి వాయిదాపడిన విషయం తెల్సిందే. దీంతో సినిమా ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.