గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (18:46 IST)

దిల్ రాజు సోదరుడి కుమారుడితో అనుపమ లిప్ లాక్.. రచ్చ రచ్చ!

ప్రేమమ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్  లిప్ లాక్ కిస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. చర్చకు దారి తీసింది. రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా అనుపమ పరమేశ్వరన్ మరొకసారి ప్రేక్షకుల ముందుకు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇలా రౌడీ బాయ్స్ చిత్రం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ దారుణంగా నెటిజన్ల ఆగ్రహానికి బలైంది.
 
ఈ క్రమంలోనే దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం రౌడీ బాయ్స్. ఇప్పటికే ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. 
 
ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోతో లిప్ లాక్ సన్నివేశాలలో నటించినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ సన్నివేశాలు ట్రైలర్‌లో చూపించడంతో నెటిజన్లు సదరు హీరోయిన్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు స్పందిస్తూ డబ్బు కోసం ఇంత దిగజారాలా అంటూ ఈమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలా లిప్ లాక్ సన్నివేశాలలో నటించడానికి కూడా ఒక స్థాయి ఉండాలి.. ఎంత బడా నిర్మాత కొడుకు అయితే మాత్రం డబ్బుకు ఆశపడి ఇలా చేయడం ఏంటి? అంటూ నెటిజన్లు ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తున్నారు.