శుక్రవారం, 19 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 8 జనవరి 2022 (16:56 IST)

ఆశిష్ హీరోగా మ‌రిన్ని సినిమాలు చేయాలి - ఎన్‌.టి.ఆర్‌.

Raju, ntr, sirish and ohters
దిల్‌రాజు సోద‌రుడు శిరీష్ కుమారుడు ఆశిష్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం  ‘రౌడీ బాయ్స్’. శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారంనాడు ఎన్‌.టి.ఆర్‌. త‌న స్వ‌గృహంలో ట్రైల‌ర్‌ను ఆవిష్క‌రించారు. అనంత‌రం ఎన్‌.టి.ఆర్‌. మాట్లాడుతూ, ఆశిష్ మూమెంట్స్ బాగున్నాయి. ఆది సినిమా నుంచి శిరీష్‌తో అసోసియేష‌న్ నాకుంది. అప్పుడు ఆశిష్ చిన్న పిల్ల‌వాడు. దిల్‌రాజు, శిరీష్‌తో జ‌ర్నీని మ‌రోసారి గుర్తుచేసుకునేలా వుంది. ఆశిష్ మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. 
 
ఇక శ్రీ‌హ‌ర్ష !హుషారు`లో చేసిన పాట‌ ఉండిపోరాదే.. నాకెంతో ఇష్టం. ప్రేమ‌దేశం సినిమాను గుర్తుచేస్తుంది. ఇప్పుడు ఈ సినిమాకు మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా. కొత్త చిత్రాలు, మంచి న‌టీన‌టుల‌ను మ‌న తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తూనే వుంటారు. ఈ సినిమా థియేట‌ర్లోనే చూడండి అని తెలిపారు.
 
నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ ‘‘‘రౌడీ బాయ్స్’ కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్. మా ఫ్యామిలీ నుంచి ఆశిష్ హీరోగా పరిచయం అవుతుండటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా బ్యానర్ వేల్యూస్‌ను దృష్టిలో పెట్టుకుని ‘రౌడీ బాయ్స్’ చిత్రాన్ని యూత్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాం. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఎప్ప‌టిలాగే ప్రేక్ష‌కులు మా హీరోని, బ్యాన‌ర్‌ని ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఆశిష్‌తో పాటు విక్ర‌మ్ కూడా మంచి పాత్ర‌లో న‌టించాడు. ఇక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో మాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. ఆమె మా ఎస్‌వీసీ బ్యాన‌ర్లో చేసిన మూడో సినిమా. త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పిస్తుంది. ఇక మ‌ది సినిమాటోగ్ర‌పీ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలుస్తాయి’’ అన్నారు.