బెడ్ రూమ్ రొమాన్స్‌లో జీవించిన బిగ్‌బాస్ బ్యూటీ దివి
నటనలో లీనమై ఆ పాత్రకు జీవం పోశారనేది తెలిసిందే. అందరికి అలా చేతకాదు. చాలా కొద్దిమందికే అలా చేతనవును. కానీ రొమాన్స్ లో మాత్రం ఎవరైనా సరే జీవించేస్తారు. మరి ఆ సీన్ ప్రత్యేకత అలాంటిది. ఎందరో నటీమణులు ఇలా రొమాన్స్‌లో రక్తికటించేశారు. తాజాగా దివి ఆ కోవలోకి చేరింది.
యూట్యూబ్ స్టార్‌గా నిలిచి ఆ ఫేమ్‌తో బిగ్‌బాస్ 4 సీజన్‌లో ప్రవేశించిన బ్యూటీ దివి. నటిగా కూడా ఆమె జీవించేసింది. రొమాంటిక్ సీన్‌లో తన భర్త కేరెక్టర్ వశిష్టతో జత కట్టింది. వంటగదిలో టమాలు కట్ చేస్తుండగా.. వచ్చిన భర్తతో.. ఏంటీ సార్‌కి మార్నింగే మూడు వచ్చిందే.. అంటుంది. నిన్ను చూస్తుంటే ఎప్పుడైనా మూడ్ వస్తుందని వశిస్ట్ బదులిస్తాడు.
ఏం చేస్తున్నావ్ అని దివి అనగానే. నిన్ను రుచిచూస్తున్నా అంటాడు భర్త.
రుచి బాగుందా తీసుకో అనగానే.. వెంటనే కట్ చేస్తే బెడ్ రూమ్ సీన్.. అక్కడ ఇద్దరి రొమాన్స్ సినిమాలో చూడాల్సిందే. యూత్‌కు కిర్రెంక్కించేదిగా వుందన్నమాట. ఇది నయీమ్ డైరీస్ అనే సినిమాలోనిది. డిసెంబర్ 10న సినిమా విడుదలకాబోతుంది. ఇటీవలే రొమాన్స్ సీన్స్‌ను చిత్ర యూనిట్ యూల్యూబ్‌లో విడుదల చేసింది. ఇందులో నయీమ్ భార్యగా దివి నటించింది.
ఇక బిగ్‌బాస్ 4షోలో డాన్సులతో, నడువొంపులతోనే మాయ చేసింది. మెగాస్టార్ చిరంజీవి బిగ్‌బాస్4 గ్రాండ్ ఫినాలే రోజు ఏకంగా తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని తెలిపారు. `భోళాశంకర్`లో ఆమెతో డాన్స్ చేసే అవకాశం ఇస్తానని చెప్పి సర్‌ప్రైజ్ చేశారు. కొడితే బూరెల గంపలో పడిందన్నమాట.