ఆకట్టుకునేలా ప్లాన్ బి- రివ్యూ రిపోర్ట్
నటీనటులుః శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, డింపుల్, రాజేంద్ర, శాని, నవీనారెడ్డి తదితరులు
సాంకేతికతః కెమెరా మాన్ : వెంకట్ గంగాధరి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : శక్తికాంత్ కార్తీక్ (ఫిదా ఫేమ్), ఎడిటర్ : ఆవుల వెంకటేష్, యాక్షన్: శంకర్ ఉయ్యాల, ఆర్ట్ : కృష్ణ చిత్తనుర్, డిటియస్ : రాధాకృష్ణ, సౌండ్ ఎఫెక్ట్స్ : రఘునాథ్.కె, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : కెవి రాజమహి, నిర్మాత : ఎవిఆర్.
సెప్టెంబర్ 17న విడుదల
ప్లాన్ బి టైటిల్ వినగానే ఇదేదో మైండ్ గేమ్‌గా వున్నట్లు తెలిసిపోతుంది. పలువురు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం వున్న కెవి రాజమహి దర్శకత్వం వహించి సినిమా ఇది. శ్రీనివాసరెడ్డి నటించడంతో ఒక భాగమైతే, ట్రైలర్‌లో ఆసక్తికర అంశాలు థ్రిల్ కలిగించే సన్నివేశాలు వుండడంతో క్రేజ్ ఏర్పడింది. ఈరోజే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథః
ఓ ఊరిలో ఓ సమస్య వల్ల ఎవ్వరికీ పిల్లలు పుట్టరు. అక్కడికి ఓ డాక్టర్ రావడంతో పరిస్థితి గ్రహించి వైద్యం చేస్తాడు. మంచి పేరు తెచ్చుకుంటాడు. కానీ ఓ జంటకు పిల్లలు పుట్టరు. ఈ పాయింట్ లీడ్‌తో కథ కొనసాగుతుంది. కట్‌చేస్తే హైదరాబాద్ సిటీలో లాయర్ శ్రీనివాసరెడ్డి. భార్యకు ఇతనంటే ఇష్టముండదు. ఓరోజు బెంగుళూరు పనిమీద వెళతాడు. ఆ తర్వాత లాయర్ హత్యకు గురవుతాడు. పోలీసుల పరిశోధనలో చూపుడువేలు కట్ చేసి వుంటుంది. ఆ దిశగాపరిశోధన ప్రారంభిస్తారు. ఆ క్రమంలో కొన్ని లింక్‌లు దొరుకుతాయి. కథ ఆసక్తికరంగా మలుపు తిరుగుతూ ఓ చోట ఆగిపోతుంది. అది ఏమిటి? ఊరిలో పిల్లలు పుట్టకపోవడానికి ఈ కథకు లింకేమిటి? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
ఈ సినిమా కథను చెప్పడమే ఆసక్తికరమైన కథతో దర్శకుడు నెరేట్ చేశాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ చాలా ఉత్సుకతను కలిగిస్తాయి. ఎక్కడా గ్రిప్పింగ్ పోకుండా కథనం దర్శకుడు రాసుకున్నాడు. దర్శకుడు చెప్పిన కథనం చకచకా జరిగిపోతుంది. అందుకే ఎక్కడా బోర్ కొట్టదు. తర్వాత ఏం జరుగుతందనే ఆసక్తి క్రియేట్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ అంశాలను ఎక్కడా విసుగు పుట్టించకుండా చేశాడు. అందుకు డిటియస్ : రాధాకృష్ణ, సౌండ్ ఎఫెక్ట్స్ : రఘునాథ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : శక్తికాంత్ కార్తీక్ కథకు ప్రాణం పోశాయి.
పోలీసు అధికారులుగా నటనాపరంగా రవి ప్రకాశ్, మురళీశర్మ బాగా నప్పారు. మిగిలిన పాత్రల్లో అందరూ బాగా అమరారు. పరిమిత బడ్జెట్‌తో చక్కగా నిర్మాణపరంగా తెరకెక్కించారు. సంభాషణల పరంగా ఎక్కడా వల్గారిటీ లేకుండా వుండడం విశేషం.
ఇక సినిమాకు ప్రధాన ఆయువుపట్టు చివరి 20 నిముషాలు. అది ప్రేక్షకుడిని థ్రిల్‌కు గురిచేసింది.క్రైమ్, థ్రిల్లర్ సినిమాలో పాటలు లేకుండా చిన్నపాటి లోపాలను అధిగమించి ఈ సినిమాకు ఆకట్టుకునేలా తీశారు. చూసే ప్రేక్షకుడికి ఈ చిత్రం థ్రిల్ కలగజేస్తుంది.
రేటింగ్ః 3/5