గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (16:40 IST)

సప్తగిరి - గూడుపుఠాణి ట్రైలర్ ఆసక్తికంగా ఉంద‌న్న ప్ర‌ముఖులు

Gooduputhani Trailer
సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్. కుమార్ దర్శకత్వంలో రూపొందిన గూడుపుఠాణి ట్రైలర్ హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో విడుద‌లైంది. అనంత‌రం వారు ఈ ట్రైల‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా వుంద‌నీ, అప్ప‌ట్లో కృష్ణ‌గారు చేసిన సినిమా టైటిల్ పెట్ట‌డం, స‌ప్త‌గిరి మ‌రో మెట్టుకు నిద‌ర్శ‌నంలా క‌నిపిస్తుంద‌ని ప్ర‌శంసించారు.
 
రియల్ ఎస్టేట్ వ్యాపార‌స్తులైన పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించిన చిత్రం "గూడుపుఠాణి " అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రే రేలీజ్ ఈవెంట్ కార్యక్రమం సినీ అతిరదుల సమక్షంలో ఘనంగా జరూపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా వచ్చిన సినీమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , దర్శకుడు మారుతి,స్పీకర్ రాంభూపాల్, ఆదోని ఎం.ఎల్.ఏ క్రాంతి కుమార్, అలీ, ఇన్ఫ్రా డెవలపర్ రంగారెడ్డి,  డైరెక్టర్ మున్నా, ధనరాజ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన 
 
తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ,  సప్తగిరి ఏ బ్యా గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో హీరో స్థాయికి చేరుకోవడం చాలా గర్వకారణం. చలన చిత్ర పరిశ్రమకు యంగ్ జనరేషన్ రావాల్సిన అవసరం ఎంతో ఉంది. హీరోగా నాలుగవ చిత్రంలో నటించిన సప్తగిరికి దేవుడు ఆశీర్వాదం తో పాటు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలి. నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్  గార్లు సినిమాను చాలా చక్కగా నిర్మించారు, వీరందరికీ ఈ సినిమా పెద్ద విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.
 
ప్రముఖ దర్శకుడు మారుతి మాట్లాడుతూ, చిత్ర ద‌ర్శ‌కుడు కుమార్ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతాప్ విద్య సంగీతం బాగుంది. చిత్ర యూనిట్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
చిత్ర నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ మాట్లాడుతూ, ఇందులో సప్తగిరి అద్భుతంగా నటించాడు. ఇంతకుముందు వచ్చిన సాగర సంగమం వసంతకోకిల, ఇంద్రుడు చంద్రుడు, చిరంజీవి స్వయంకృషి, అలీగారి మయాలోడు చిత్రాలలో వారంతా నటించి ఎలా మెప్పించారో వారి లాగే  అద్భుతమైన నటనతో ఈ సినిమాలో సప్తగిరి తన నటనతో విశ్వరూపం చూపించాడు. ఇంతమంచి సినిమాకు సంగీత దర్శకుడు తన పాటలతో ప్రాణం పోశాడు. పెద్ద పెద్ద సంగీత దర్శకులకు తీసిపోకుండా ఇందులో చాలా మంచి సంగీతం అందించాడు. హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్మంగళూరు పరిసర అందమైన లొకేషన్స్ లో సినిమా తీశాము. దర్శకుడు తన ప్రతిభతో ఈ సినిమాను మరో  లెవెల్ కు  తీసుకెళ్ళాడని తెలిపారు.
 
హీరో సప్తగిరి మాట్లాడుతూ, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూడుపుఠాణి  టైటిల్ తో నేను సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు కుమార్ చెప్పిన లైన్ నచ్చి చాలా థ్రిల్ ఫీలయ్యి ఈ సినిమాచేస్తున్నాను. నేను చిన్న హీరోను అయినా కూడా ఈ సినిమాకు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు నిర్మాతలు. సినిమా ట్రైలర్ చూసిన వారందరూ కూడా  క్లాసీగా చాలా అందంగా ఉన్నావని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.ఇదంతా కెమెరామెన్‌ పవన్ చెన్నకే దక్కుతుంది. ముఖ్యంగా మా అన్నయ్య దర్శకుడు మారుతి గారు పిలిచిన వెంటనే నీకు నేనున్నాను అంటూ వచ్చి నన్ను బ్లెస్స్ చేశాడు. ఆయన ద్వారానే నేను ఇండస్ట్రీని చూడడం జరిగింది. అన్నయ్య తీసిన  "ప్రేమ కథా చిత్రం" ద్వారా స్టార్ కమెడియన్ అయ్యాను. ఆ చిత్రంతో నా లైఫ్ మార్చిన గొప్ప మహానుభావుడు తను. నేను రోజు ఇంతటి వాడినవ్వడానికి కారణం తనే.  ఈ సినిమాలో రఘు కుంచే విలన్ గా చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. తెలుగు సినిమాకు మంచి విలన్ దొరికాడు . స్పీకర్ రాంభూపాల్ రెడ్డి ఆదోని ఎమ్ ఎల్.ఏ, ఆలీ గారు ఇలా అందరూ వచ్చి నన్ను నా సినిమాను బ్లెస్స్ చేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు.
 
చిత్ర దర్శకుడు కుమార్ కె.ఎం మాట్లాడుతూ, సినిమా షూటింగ్ అయిపోయింది సెన్సార్ అయినప్పుడు సెన్సార్ వాళ్ళు పిలిచి సినిమా చాలా బాగుంది బాగా తీసావ్ అని చెప్పడం నా హ్యాపీ ఫీలయ్యాను. ఈ సినిమా ఫస్ట్ సీన్ మొదలుకొని లాస్ట్ సీన్ వరకు ఎక్కడా టెంపో తగ్గకుండా విపరీతమైన ఇంట్రెస్ట్ తో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ సినిమా అలరిస్తుంది అన్నారు.
 
సంగీత దర్శకుడు  ప్రతాప్ విద్య మాట్లాడుతూ, హరీష్ శంకర్ గారు రిలీజ్ చేసిన సాంగ్ కు ప్రేక్షకులందరూ మంచి బ్లెస్సింగ్స్ అందించారు. ఈ సినిమాలోని పాటలు చాలా బాగా వచ్చాయి. సప్తగిరి లాంటి మంచి ఆర్టిస్టు తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలియ‌జేశారు.