బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (17:45 IST)

పిల్లలు గొలుసులు కట్టి `హౌస్ అరెస్ట్` చేస్తే!

Saptagiri, Allari Ravi babu, House Arrest
నిఖార్సైన వినోదానికి సరైన నిర్వచనం కరువవుతున్న తరుణంలో అన్ని వర్గాలను అందులోనూ పిల్లలను అలరించే సినిమాలు గత పదిహేనేళ్లలో ఎన్ని వచ్చాయో చెప్పమంటే ఎవరైనా గుటకలు మింగడం ఖాయం. హాలీవుడ్ నుంచి వచ్చే ఎవెంజర్స్ లాంటి సూపర్ హీరోల మూవీస్ తప్ప తెలుగులోనూ తమను మెప్పించే చిత్రాలు వస్తాయని నమ్మే పిల్లలు ఎందరున్నారు. ఆ నమ్మకం తప్పని ఋజువు చేసేందుకు వస్తున్న హోల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'హౌస్ అరెస్ట్'. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల సందర్భంగా తమ సినిమాలో ఏం ఇవ్వబోతున్నామో టీమ్ చాలా స్పష్టంగా చెప్పింది. ఓ నమ్మకాన్ని ఏర్పరిచింది.
 
ప్రేక్షకులు మెచ్చేలా వినోదాన్ని అందిస్తే చాలు ఆదరిస్తారని నమ్మే దర్శకులు శేఖర్ రెడ్డి ఎర్ర. తన మొదటి సినిమా 90ఎంఎల్ ని ఈ సూత్రాన్నే ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దిన తీరు క్లాసు మాసు అందరినీ మెప్పించింది. అయితే ఈసారి యూత్ అనో లేదా ఇంకో ప్రత్యేకమైన జానర్ అనో లెక్కలు వేసుకోకుండా పిల్లలతో పాటుగా పెద్దలు సైతం నవ్వుకునేలా చక్కని వినోదాత్మక చిత్రాన్ని అందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే హౌస్ అరెస్ట్ కి శ్రీకారం చుట్టేలా చేసింది. సంగీత సంచలనం అనూప్ రూబెన్స్ స్వరకల్పనలో స్టార్లను కాకుండా కేవలం ఆర్టిస్టులను నమ్ముకుని చేసిన సినిమా హౌస్ అరెస్ట్
 
ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని తీర్చిదిద్దిన తీరు ఆసక్తి గొలిపేలా ఉంది. అయిదుగురు మన ఇంట్లోనో లేదా చుట్టుపక్కల్లో చూసినట్టు ఉండే పిల్లలు, కాదు కాదు చిచ్ఛర పిడుగులు, వాళ్ళ చేత చిక్కిన ఓ దుండగుల బ్యాచ్. అసలు ఈ రెండు గ్యాంగుల మధ్య ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, సూపర్ కిడ్స్ ని ఏం చేయాలనే ఆలోచనతో వాళ్ళు వచ్చారు, పిల్లలు గొలుసులు కట్టి మరీ వాళ్ళను ఆడించేలా జరిగిన అల్లరి ఏమిటి లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అతి త్వరలో హౌస్ అరెస్ట్ విడుదలయ్యే దాకా ఆగాల్సిందే. ఇది కదా మేం చూడాలుకుంటున్న సినిమాలు అని ఫీలింగ్ కలిగేలా మోషన్ పోస్టర్ ని తీర్చిద్దిన విధానం అభినందనీయం.
 
శ్రీ‌నివాస‌రెడ్డి, స‌ప్త‌గిరి, అల్ల‌రి ర‌వి బాబు, అదుర్స్ ర‌ఘు, ర‌విప్ర‌కాష్‌, తాగుబోతు ర‌మేష్‌, కౌశిక్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి కెమెరాః జె. యువ‌రాజ్‌, పాట‌లుః చంద్ర‌బోస్‌, నిర్మాతః కె. నిరంజ‌న్ రెడ్డి.