ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (12:50 IST)

ఎఫ్‌బీ డీపీగా అమ్మాయి ఫోటో.. జగ్గారెడ్డికి షాకిచ్చిన కేటుగాళ్లు

సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరిట ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ క్రియేట్ చేశారు కేటుగాళ్లు. ఆ ఎఫ్‌బీ డీపీగా ఒక అమ్మాయి ఫోటోను పెట్టారు. ఈ విషయం ఎమ్మెల్యే జగ్గారెడ్డి దృష్టికి చేరడంతో ఆయన అలర్ట్ అయ్యారు. తన అనుచరులందరినీ అప్రమత్తం చేశారు.
 
తన పేరు మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొత్త ఫేస్ బుక్ ఐడీ క్రీట్ చేశారని చెప్పారు. ఈ ఫేస్‌బుక్ డీపీగా అమ్మాయి ఫోటో పెట్టారు. అలాగే కొన్ని తప్పుడు ఫోటోలు పెట్టి తన పేరును డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 
 
శుక్రవారం ఈ వ్యవహారంపై తాను సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. తన పేరుతో కొత్తగా క్రియేట్ చేసిన ఫేస్ బుక్ ఐడీ తనది కాదు. ప్రజలు ఎవరూ మోసపోవద్దు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండని జగ్గారెడ్డి క్లారిటీ ఇవ్వడంతో పాటు ప్రజలను అలర్ట్ చేశారు.