మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (18:26 IST)

నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి మృతి

నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి సోమవారం కన్నుమూశారు. గత యేడాది కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయన నెల్లూరులోని తన నివాసంలో చనిపోయారు. 
 
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎంతో క్రియాశీలంగా ఉన్న శ్రీధర్ కృష్ణారెడ్డి గత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్‌పై 90 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 
 
నెల్లూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడుగా, నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఈయన పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్‌పై 14 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 
 
2009లో ఆయనకు టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ తరపున టిక్కెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున నారాయణ విద్యా సంస్థల అధినేత పి.నారాయణ పోటీ చేసి ఓడిపోయారు.