1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (10:09 IST)

మాజీ మంత్రి ఫరీదుద్దీన్ మృతి - సీఎం కేసీఆర్ సంతాపం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మహ్మద్ ఫరీదుద్దీన్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన 64 యేళ్ల ఆయన హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స  పొందుతూ వచ్చారు. అయితే, ఆయనకు బుధవారం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
కాగా, గత 2004లో జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఫరీదుద్దీన్ విజయం సాధించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మైనార్టీ సంక్షేమ శాఖామంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి శాసనమండలి సభ్యుడుగా అడుగుపెట్టారు. 
 
ఆయన మృతిపట్ల తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు ఆయన తన సానుభూతిని తెలిపారు. మైనార్టీ నేతగా ఆయన మంత్రిగానేకాకుండా ఒక రాజకీయ నేతగా విశేష సేవలు అందించారు.