శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 22 జనవరి 2022 (15:39 IST)

దారుణం... లిఫ్టులో ఇరుక్కుపోయి పనిమనిషి మృతి

లిఫ్టులో ఇరుక్కుని ఓ పనిమనిషి మృతి చెందిన ఘటన హైదరాబాదులోని షేక్ పేటలో చోటుచేసుకుంది. ఆమె వేకువ జామున లేచి ఇళ్లలో పనిచేసేందుకు వస్తుంటుంది. అలాగే శనివారం తెల్లవారు జామున లేచి షేక్ పేటలో వున్న అపార్టుమెంటుకు వచ్చింది.

 
అక్కడ లిఫ్ట్ ఎక్కింది. ఐతే అది మధ్యలోనే ఆగిపోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై అందులోనే ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో అంతా నిద్రలో వుండటంతో ఆమెను ఎవరూ గమనించలేకపోయారు. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.