బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 6 జనవరి 2022 (15:56 IST)

ఆధ్యాత్మిక న‌గ‌రం తిరుప‌తిలో జాతీయ కబడ్డీ పోటీలు భేష్‌

ఆధ్యాత్మిక నగరంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహణ తిరుపతికే  తలమానికమని ప్రభుత్వ విప్, తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఇందిరా మైదానంలో రెండో రోజు కబడ్డీ లీగ్ పోటీలను ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. 
 
 
ముందుగా  ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి మేయర్ శిరీష పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి కబడ్డీ పోటీలను తిలకించారు. అంతకుముందు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ మహిళా క్రీడాకారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు అద్భుతంగా చేశారని కొనియాడారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పర్యవేక్షణలో అందరి సమిష్టి కృషితో జాతీయ స్థాయి పోటీలు విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.