గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 మార్చి 2022 (14:42 IST)

రైల్వేలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు : కేంద్రం

రైల్వేను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. రైల్వేను ప్రైవేటీకరణ చేయబోతున్నారంటూ విపక్ష సభ్యులు గురువారం పార్లమెంట్‌లో ఆందోళన చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రైల్వేను ప్రైవేటీకరించనున్నట్టు సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, రైల్వేను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. 
 
బడ్జెట్‌లో రైల్వే శాఖ కేటాయింపులపై గురువారం చర్చ జరిగింది. దీనిపై అనేక మంది విపక్ష సభ్యులు మాట్లాడారు. రైల్వేల ప్రైవేటీకరణకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఆరోపిస్తూ సభలో ఆందోళన వ్యక్తం చేశారు. 
 
దీంతో రైల్వేశాఖామంత్రి అశ్విన్ వైష్ణవ్ వివరణ ఇచ్చారు. రైల్వేలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. రైల్వే వ్యవస్థలో రైళ్ళు, ట్రాక్‌లు, రైల్వేస్టేషన్లు, ఇంజిన్లు, బోగీలు అన్ని ప్రభుత్వ ఆస్తులేనని వివరించారు. రైల్వేను కేంద్రం ప్రైటీకరిస్తుందన్న ఆరోపణలు విపక్ష సభ్యుల ఊహాజనితమేనని అశ్విన్ వైష్ణవ్ స్పష్టం చేశారు.