సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 మే 2022 (16:18 IST)

కుప్పంలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

chandrababu
కుప్పంలో మూడు రోజుల పాటు టీడీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 12వ తేదీ ఈ పర్యటన ప్రారంభమైంది. 13, 14 తేదీల్లోనూ చంద్రబాబు పర్యటిస్తారు.

శాంతిపురం, కుప్పం, రామకుప్పం, గుడుపల్లి మండలాల్లో టీడీపీ అధినేత పర్యటిస్తారు. గురువారం కుప్పంలో ప్రతీ ఐదేళ్లకు ఒకసారి జరిగే పట్టాలమ్మ జాతరలో పాల్గొన్నారు. 
 
ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుకు సరిహద్దులో ఉన్న పట్టాలమ్మ తల్లి జాతరలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో సమ్మక్క సారక్క జాతరలా పట్టాలమ్మ జాతరలా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
 
అలాగే ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు కుప్పంలో పాల్గొంటారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. అధినేత పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.