సంబంధిత వార్తలు
- జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రమూకల దాడి.. పోలీస్ కానిస్టేబుల్ మృతి
- చిరంజీవి గాడ్‌ఫాదర్ కోసం సరికొత్త ప్రణాళిక
- నా అల్లుడు బంగారం.. కట్నంగా ఎంత ఇచ్చామో తెలుసా? బన్నీ మామ
- కొడుకు పుట్టాలన్న ఆశతో తాంత్రికుడితో కలిసి కుమార్తెలపై తండ్రి అత్యాచారం
- కుమార్తె కాలేయాన్ని తండ్రికి అమర్చిన వైద్యులు.. అరుదైన ఆపరేషన్.. ఎక్కడ?
పరువు కోసం కన్నబిడ్డనే కడతేర్చాడు.. ప్రేమకు వద్దన్నాడు.. ఒప్పుకోకపోవడంతో?
తెలంగాణలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. మనుషుల ప్రాణాల కంటే కులాలకు విలువనిచ్చే మృగాల సంఖ్య పెరిగిపోతోంది. పరువు కోసం కన్నబిడ్డల్ని పొట్టనబెట్టుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో పరువు కోసం ఏకంగా కూతురి ప్రాణాలనే తీశాడో తండ్రి.
వేరే మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. గొంతు కోసి చంపేశాడు. ఇన్నేళ్లు ప్రేమగా పెంచి, మమకారం పంచిన తండ్రే.. పరువు కోసం కర్కోటకుడిగా మారాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని పెంచిన చేతులతోనే చంపేశాడు.
వివరాల్లోకి వెళితే నార్నూరు మండలం నాగల్ కొండ గ్రామానికి చెందిన రాజేశ్వరి, అదే గ్రామానికి చెందిన షేక్ అలీంను ప్రేమించింది. అయితే పెళ్లికి రాజేశ్వరి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ప్రేమికులు ఇద్దరూ మూడు నెలల క్రితం పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
ఇటీవలే వారిద్దరూ తిరిగి గ్రామానికి వచ్చారు. దీంతో రాజేశ్వరి తండ్రి గామంలో పంచాయితీ పెట్టాడు. కొద్ది రోజుల వరకు విడివిడిగా ఉండాలని పెద్దలు చెప్పడంతో.. ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. దీంతో పాటు షేక్ అలీంను మరచిపోవాలని దేవదాస్.. కూతురు రాజేశ్వరిని హెచ్చరించాడు.
అందుకు ఆమె నిరాకరించడంతో కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. విచారణలో దేవదాస్ నేరం అంగీకరించడంతో.. నార్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.