ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జూన్ 2022 (11:44 IST)

రూ.151తో బంపర్ ప్లాన్ ప్రకటించిన జియో - వ్యాలిడిటీ 90 డేస్

jioservice
దేశంలోని ప్రైవేట్ టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న జియో ఇపుడు తన మొబైల్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఇందులోభాగంగా రూ.151కే సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ తీసుకున్నవారికి మూడు నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా ఇవ్వనుంది. అయితే, రూ.151 ప్లాన్‌ కేవలం డేటా ప్యాక్ ప్లాన్ మాత్రమే. 
 
మొత్తం 90 రోజుల కారపరిమితితో 8 జీబీ డేటాను ఉచితంగా అందివ్వనుంది.  అయితే, ఏదైనా సాధారణ ప్లాన్‌పై కొనసాగుతున్నపుడు మాత్రమే ఈ డేటా ప్లాన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ మాత్రమ కాకుండా, రూ.333, రూ.583, రూ.783 ప్లాన్లను కూడా జియో ప్రకటించింది. వీటన్నింటిలోనూ మూడు నెలల కాలపరిమితితో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్ లభించనుంది.