ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మే 2022 (19:07 IST)

త్వరలోనే దేశంలో డిజిటల్ కరెన్సీ : ఆర్బీఐ సన్నాహాలు

reserve bank of india
భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుచేసే దిశగా అడుగులు వేస్తుంది. శుక్రవారం ఆర్బీఐ వార్షిక నివేదికలో కీలక అంశాన్ని ప్రస్తావించింది. దేశంలో డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతుంది. ఈ కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)గా పేర్కొంటున్నారు. అయితే, దేశంలో డిజిటల్ కరెన్సీని దశలవారీగా ప్రవేశపెట్టాలని భావిస్తుంది. 
 
నిజానికి ఈ తరహా కరెన్సీని తీసుకునిరావాలని ఆర్బీఐ ఎప్పటి నుంచో భావిస్తుంది. పైలెట్ ప్రాజెక్టు కింద డిజిటల్ కరెన్సీ అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. డిజిటల్ కరెన్సీ కాన్సెప్టుని బలపరిచే అంశాల నిర్ధారణ, పైలట్ ప్రాజెక్టుల్లో వచ్చే ఫలితాలు, కరెన్సీ అమలు ఇలా దశల వారీగా తీసుకొస్తామి సెంట్రల్ బ్యాంకు తెలిపింది. 
 
అయితే, అన్ని అంశాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతామని తెలిపింది. మరోవైపు, దేశంలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే అంశాన్ని 2022-23 కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ప్రస్తావించిన విషయం తెల్సిందే.