సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 మే 2022 (18:33 IST)

మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ జీ52 విక్రయాలు ప్రారంభం

Moto G52
Moto G52
మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ జీ52 విక్రయాలు ప్రారంభమైనాయి. ఈ ఫోనులు అందుబాటు ధరలోనే లభిస్తున్నాయి. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,499. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,499. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. 
 
నీటి చుక్కలు పడినా రక్షణ కల్పించే సదుపాయం ఉంటుంది. డాల్బీ ఆటోమ్ సిస్టమ్ కూడా ఉంది. ఫ్లిప్ కార్ట్ పోర్టల్‌పై కొనుగోలు చేసుకోవచ్చు.
 
90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో, 6.6 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేతో ఈ ఫోన్ వస్తుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ ను ఏర్పాటు చేశారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. బడ్జెట్ విభాగంలో తక్కువ బరువు, స్లిమ్‌గా ఉంటుందని మోటోరోలా ప్రకటించింది. 
 
ప్రొసిలైన్ వైట్, చార్ కోల్ గ్రే రంగుల్లో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. దీనికి సౌండ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. 
 
వెనుక భాగంలో 50 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 
8 ఎంపీ అల్ట్రావైడ్, 2ఎంపీ డెప్త్ సెన్సింగ్ కెమెరా, ఐపీ 52 రేటింట్‌తో ఈ ఫోన్ వస్తుంది.