గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (20:29 IST)

యునైటెడ్‌ నేషన్స్‌ ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ రెస్పాన్సబల్‌ ఇన్వెస్టింగ్‌‌గా ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంతకం

యునైటెడ్‌ నేషన్స్‌ మద్దతునందించే ప్రిన్సిపల్స్‌ ఫర్‌ రెస్పాన్సిబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (యుఎన్‌పీఆర్‌ఐ)కు మద్దతునందిస్తున్న మొట్టమొదటి భారతీయ భీమా కంపెనీగా ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నిలిచింది. తద్వారా పర్యావరణ, సామాజిక మద్దతు పరిపాలన (ఈఎస్‌జీ) అంశాల పట్ల తమ నిబద్ధతను వెల్లడిస్తుంది.

 
సస్టెయినబిలిటీని ప్రోత్సహించాలనే ప్రయత్నంలో భాగంగా కంపెనీ తమ ఈఎస్‌జీ ఫ్యాక్టర్స్‌ను తమ పెట్టుబడుల నిర్వహణ  విధానంలో భాగం చేసుకుంది. ఓ బాధ్యతాయుతమైన సంస్థగా తమ వ్యాపార కార్యకలాపాలంతటా ఇది సస్టెయినబిలిటీ ప్రిన్సిపల్స్‌ను స్వీకరించింది.

 
ఈ సస్టెయినబిలిటీ విధానాన్ని ఈఎస్‌జీకి చెందిన మూడు ముఖ్య అంశాలపై నిర్మించారు. దీనిలో ఈ భూగోళాన్ని భావితరం సైతం నివశించేందుకు అత్యుత్తమ  ప్రాంగణంగా మార్చడం, సమాజానికి తిరిగివ్వడం, పనితీరుపరంగా పారదర్శకత తీసుకురావడం. నిర్వహణలో 2.37 ట్రిలియన్‌ రూపాయలు కలిగిన ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, అత్యంత కీలకమైన సంస్థాగత మదుపరునిగా నిలిచింది.

 
ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ శ్రీ మనీష్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘‘యున్‌పీఆర్‌ఐపై సంతకం చేసిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా నిలువడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈఎస్‌జీ సూత్రాలను మా పెట్టుబడుల నిర్ణయంలో మిళితం చేయడానికి చూపుతున్న నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది.

 
వాతావరణ మార్పుల కారణంగా మన చుట్టూ ఉన్న వారి జీవితాలతో పాటుగా జీవనోపాధి కూడా ప్రభావితమవుతుంది. దేశంలో అతిపెద్ద ఆర్ధిక సంస్థలలో ఒకటిగా, భూగోళ పరిరక్షణకు ఈఎస్‌జీ అంశాలపై బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. సస్టెయినబల్‌ ఇన్వెస్టింగ్‌లో భాగంగా మేము సస్టెయినబల్‌ ఈక్విటీ ఫండ్‌ ఆవిష్కరించాము. ఈఎస్‌జీపై దృష్టి సారించి విడుదల చేసిన ఫండ్‌ ఇది. ఈ ప్రక్రియలో ఇది భారతదేశంలో మొట్టమొదటి కంపెనీగా నిలిచింది..’’ అని అన్నారు.