గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (21:42 IST)

''ట్రావెల్‌ యూనియన్‌''ను ప్రారంభించిన సోనూసూద్

కరోనా టైమ్‌లో లాక్డౌన్ పేదల పాలిట ఆపద్భాంధవుడిగా నిలిచాడు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, స్ట్రీట్ వ్యాపారులకు మద్దతుగా ప్రచారం చేస్తుండగా.. ఇప్పుడు ఏకంగా గ్రామీణ ప్రయాణికుల కోసం టెక్నాలజీని జోడించి ఓ ఫ్లాట్ ఫామ్ తీసుకొచ్చాడు.
 
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రయాణికుల అవసరాలను తీర్చే విధంగా, ట్రావెల్‌ ఏజెంట్లకు ఉపయోగపడేలా 'ట్రావెల్‌ యూనియన్‌' అనే ప్లాట్‌ఫాంను సోనూసూద్‌ లాంచ్‌ చేశారు. బీ2బీ(బిజినెస్‌ టూ బిజినెస్‌) ట్రావెల్‌ టెక్‌ప్లాట్‌పాంగా నిలవనున్న ఈ ప్లాట్‌ఫాం ఇండియాలోనే తొలి గ్రామీణ ఫ్లాట్ ఫామ్. 
 
ఇప్పటివరకు గ్రామీణ స్థాయిలో ట్రావెలింగ్‌ సెక్టార్‌ అసంఘటితంగా ఉంది. ట్రావెలింగ్‌ సంస్థలు కూడా గ్రామీణ ప్రాంతాలలో సేవలకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఇదే విషయాన్ని ట్రావెల్‌ యూనియన్‌ సంఘాలు సోనూ దృష్టికి తీసుకెళ్లగా ఇందుకోసం ఓ ఫ్లాట్ ఫామ్ ఆవిష్కృతమైంది.
 
ఈ ఫ్లాట్ ఫామ్ తో గ్రామీణ ప్రయాణికులకు తక్కువ ధరలోనే ప్రయాణాలను, ఇతర సదుపాయాలను ఆఫర్‌ చేయవచ్చునని ట్రావెల్‌ ఏజెంట్లు వెల్లడించగా.. ఈ ప్లాట్‌ఫాం మల్టిపుల్ ట్రావెల్ సర్వీస్ పార్టనర్‌లతో భాగస్వామ్యంతో మరింత సేవలు అందించనుంది. 
 
ఐఆర్‌సీటీసీ, 500కు విమాన ప్రయాణాలు, ప్రైవేట్ బస్‌ ఆపరేటర్లతో పాటు టూరిస్టులు, ప్రయాణికుల సౌకర్యాల కోసం 10 లక్షలకు పైగా హోటల్‌ సదుపాయాలను ఈ ప్లాట్ ఫాం యాక్సెస్‌ అందించనుంది. కాగా.. ప్రస్తుతం ఈ ట్రావెల్‌ యూనియన్‌ ప్లాట్‌ఫాం ఇంగ్లీష్‌, హిందీ భాషలో అందుబాటులో ఉండగా త‍్వరలోనే మరో 11 రిజనల్‌ భాషల్లో కూడా సేవలను అందించనుంది.