ఆదివారం, 3 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2025 (16:37 IST)

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

Ravi Teja, Mass Jatara
Ravi Teja, Mass Jatara
రవితేజ కథానాయకుడిగా  నటించిన సినిమా మాస్ జాతర. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనే టాక్ నెలకొంది. ఆయన అబిమానులు రవితేజ సినిమా అప్ డేట్ కోసం సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సెట్స్ నుంచి చిత్ర బ్రుందం అప్ డేట్ ఇచ్చింది. మాస్ జాతర కోసం రవితేజ డబ్బింగ్ ప్రారంభమైంది. కేవలం 26 రోజులు మాత్రమే మిగిలివున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 1న కొత్త అప్ డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
 
శ్రీలీల, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే రవితేజ డబ్బింగ్ ప్రారంభించారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బేనర్ పై, శ్రీకర స్టూడియోస్, ఫార్స్యూన్స్ ఫోర్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా, ఈ సినిమాను ఆగస్టు 27న విడుదలచేయడానికి సిద్ధం చేస్తున్నారు.