1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Babar Azam set to complete 10,000 international runs

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఖాతాలో కొత్త రికార్డ్

babar azam
గతంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ కూడా అయిన ఇంజిమాముల్ హక్ అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగులు సాధించి ఎలైట్ జాబితాలో చోటు సంపాదించాడు. 
 
తాజాగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఖాతాలో చేరేందుకు మరో రికార్డు సిద్ధంగా వుంది. నేడు ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో తొలి వన్డే జరగనుంది. 
 
ఈ సిరీస్‌లో కనుక బాబర్ మరో 202 పరుగులు సాధిస్తే పాకిస్థాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తిచేసుకున్న 11వ బ్యాటర్‌గా రికార్డులకెక్కుతాడు. ఇప్పటి వరకు 200 మ్యాచ్‌లు ఆడిన 27 ఏళ్ల బాబర్ 9,798 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 65 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 
 
పాకిస్థాన్ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఇంజిమాముల్ హక్, యూనిస్ ఖాన్, మహమ్మద్ యూసుఫ్, జావెద్ మియాందాద్, సలీం మాలిక్, సయీద్ అన్వర్, మొహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, షాహిద్ అఫ్రిది, మిస్బావుల్ హక్ పాక్ తరపున 10 వేల పరుగులు సాధించారు. ఇప్పుడు వీరి సరసన బాబర్ చేరనున్నాడు.  
తర్వాతి కథనం
అంతర్జాతీయ క్రికెట్‌కు బైబై చెప్పేసిన మిథాలీ రాజ్