సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (12:17 IST)

నేడు ఏపీలో పదో తరగతి ఫలితాలు--- ఫలితాల కోసం క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం (నేడు) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు పూర్తిచేశారు. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ రిలీజ్ చేశారు. 
 
నిజానికి ఈ ఫలితాలు శనివారమే విడుదల కావాల్సి వుంది. కానీ, అనివార్య కారణాల కారణంగా వాయిదాపడ్డాయి. ముఖ్యంగా, విద్యాఖామంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు, విద్యాశాఖ అధికారులకు మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఈ పరీక్షా ఫలితాలను వెల్లడించారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 

 
వీటిని సరిదిద్దుకునే చర్యల్లో భాగంగా, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను వెల్లడించనున్నట్టు అధికారులు ఆదివారం ప్రకటించారు. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను www.results.bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో చూసి తెలుసుకోవచ్చు.