సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జూన్ 2022 (13:21 IST)

అనకాపల్లి అచ్యుతాపురంలో మరోమారు గ్యాస్ లీక్

gas leak
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఇటీవల గ్యాస్ లీకైంది. ఈ ఘటన మరువకముందే ఇక్కడే ఉన్న మరో సెజ్‌లో మరోమారు విషవాయువు కలకలం రేపింది. సీడ్స్ కంపెనీ వద్ద మరోసారి విషవాయువు వ్యాపించింది. ఆ వెంటనే అప్రమత్తమైన బ్రాండిక్స్ కంపెనీ ప్రతినిధులు కాలుష్య నియంత్రణ మండలికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. 
 
అయితే, ఆదివారం కావడంతో సెజ్‌లో సిబ్బంది విధులకు హాజరుకాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అధికారులు, సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఇదిలావుంటే, అచ్యుతాపురం సీడ్స్ కంపెనీలో రెండు రోజుల క్రితం జరిగిన గ్యాస్ లీక్ కేసు ఘటనకు సంబంధించిన కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ లీకేజీ వ్యవహారంపై పీసీబీ విచారణ జరుపుతోంది.