శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (10:51 IST)

ఆస్ట్రేలియాతో రెండో వన్డే: పాక్ ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ జట్టు వన్డే చరిత్రలో అతి పెద్ద లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా ఆసీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీ స్కోరు సాధించింది. 
 
ఇందులో భాగంగా బెన్‌ మెక్‌డెర్మట్‌ (108 బంతుల్లో 104; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించగా...ట్రవిస్‌ హెడ్‌ (70 బంతుల్లో 89; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), మార్నస్‌ లబ్‌షేన్‌ (49 బంతుల్లో 59; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
 
షాహిన్‌ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాక్‌ 49 ఓవర్లలో 4 వికెట్లకు 352 పరుగులు చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (83 బంతుల్లో 114; 11 ఫోర్లు, 1 సిక్స్‌), ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (97 బంతుల్లో 106; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో చెలరేగగా, ఫఖర్‌ జమాన్‌ (64 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. తాజా ఫలితంతో సిరీస్‌ 1-1తో సమం కాగా, చివరి వన్డే శనివారం జరుగుతుంది.