1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (14:11 IST)

రెండో వన్డే మ్యాచ్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు శుక్రవారం రెండో వన్డే మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే తొలి వన్డేలో భారత్ చిత్తుగా ఓడిన విషయం తెల్సిందే. ఇపుడు రెండో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 
 
ఈ మ్యాచ్ కోసం తొలి వన్డేలో ఆడిన జట్టు సభ్యులనే బరిలోకి దించారు. అయితే, ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టులో మాత్రం ఒక మార్పు చేశారు. పేసర్ మార్కో జాన్సెన్ స్థానంలో సిసాండ మగాలను జట్టులోకి తీసుకున్నారు. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే,
 
భారత్ : రాహుల్, ధావన్, కోహ్లీ, శ్రేయాస్, రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్, ఠాకూర్, అశ్విన్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్. 
 
దక్షిణాఫ్రికా : డికాక్, మలన్, బవుమా, మార్క్రమ్, డస్సెన్, మిల్లర్, ఫెహ్లువాయో, మహరాజ్, మలాంగ, ఎంగిడీ, షంసీ.