శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (11:22 IST)

జూలో 3 సింహాలకు కరోనా.. ఎలా సోకిందంటే?

ఓ జూలో మూడు సింహాలు కరోనా బారినపడ్డాయి. మనుషుల ద్వారానే వీటికి వైరస్ సంక్రమించి ఉంటుందని నిర్ధారించారు. గౌటెంగ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేటు జూలో లక్షణాలు లేని వ్యక్తుల ద్వారా వీటికి వైరస్ సోకినట్టు గుర్తించారు. 
 
మనుషుల ద్వారా మూడు సింహాలకు కరోనా సోకిన ఘటన దక్షిణాఫ్రికాలోని ఓ జూలో చోటుచేసుకుంది. కోవిడ్ బారినపడిన సింహాలు దగ్గు, ఆయాసం, ముక్కు కారడం వంటి లక్షణాలతో 15 రోజులపాటు బాధపడినట్టు ప్రిటోరియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. దక్షిణాఫ్రికా, గౌటెంగ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ జూలోని సింహాలు కరోనాతో నానా తంటాలు పడుతున్నాయని వారు చెప్తున్నారు. 
 
గతేడాది చివర్లో దక్షిణాఫ్రికాలో డెల్టా వేరియంట్ కారణంగా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఇది జరిగింది. ఐదు నుంచి 15 రోజుల పాటు పొడిదగ్గుతో బాధపడగా, రెండు సింహాలు మాత్రం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డాయి. మొత్తంగా 25 రోజుల్లో సింహాలన్నీ కొవిడ్‌ను జయించాయి.