గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (16:36 IST)

ఎయిర్‌లైన్స్‌పై ఫైర్ అయిన బ్రహ్మాజీ- ఏందయ్యా మీ సర్వీస్..?

Bramhaji
Bramhaji
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మజీ చండీఘడ్ నుంచి కులు వెళ్లాల్సి ఉండగా తాను వెళ్లాల్సిన ఫ్లైట్ చాలా ఆలస్యంగా వచ్చింది. మొదట రెండు గంటలు వెయిట్ చేసి తన ఓపిక నశించడంతో ట్విట్టర్‌లో ఆ విమాన సంస్థని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
 
'నేను చండీగఢ్ నుంచి కులు వెళ్ళడానికి ఎయిర్‌పోర్ట్‌లో రెండు గంటల నుంచి ఎదురు చూస్తున్నాను. విమానం లేట్ అయినందుకు అలయన్స్ ఎయిర్ లైన్స్ సంస్థ నుంచి ఎలాంటి సమాచారం కానీ, క్షమాపణ కానీ లేదు' అని పోస్ట్ చేశారు బ్రహ్మాజీ. 
Airlines
Airlines
 
ఇక ఐదుగంటల నిరీక్షణ తర్వాత బ్రహ్మాజీ వెళ్లాల్సిన విమానం రాగా విమానం ఫోటోని పోస్ట్ చేసి..' ఐదుగంటల తర్వాత నేను ఎక్కాల్సిన విమానం వచ్చింది. దీంతో బ్రహ్మాజీ చేసిన ట్వీట్స్ వైరల్‌గా మారాయి.