మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మే 2022 (13:42 IST)

చడీచప్పుడు లేకుండా హైదరాబాద్ వచ్చిన సీఎం కేసీఆర్

cmkcr
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పర్యటన ఢిల్లీ పర్యటన చడీచప్పుడు లేకుండా అంటే అర్థాంతరంగా ముగించుకుని హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఈ నెల 20వ తేదీన ఢిల్లీకి వెళ్లిన ఆయన ఢిల్లీలో మకాం వేసి ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. 
 
ఆ తర్వాత వారిద్దరూ కలిసి చండీగఢ్ చేరుకుని, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 600 మంది రైతు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆయన ఆర్థిక సాయం చేశారు. ఇంతవరకు పర్యటన సజావుగానే సాగింది. 
 
ఇంతలో ఏమైందో ఏమోగానీ, సీఎం కేసీఆర్ తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. మంగళ, బుధవారాల్లో వివిధ రాజకీయ పార్టీ నేతలతో జరగాల్సిన చర్యలను రద్దు చేసుకున్నారు. 
 
అలాగే, ఈ నెల 25వ తేదీన బెంగుళూరు వెళ్లి మాజీ సీఎం దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిను, 27వ తేదీన మహారాష్ట్రలోని రాలేగావ్‌కు వెళ్లి అన్నాహజారేతో భేటీ కావాల్సి వుంది. 
 
అక్కడ నుంచి షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శనం చేసుకుని హైదరాబాద్ రావాల్సివ వుంది. అయితే, ఇపుడు తన పర్యటను అర్థాంతరంగా ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకోవడంతో తదుపరి పర్యటనలపై ఓ స్పష్టత రావాల్సివుంది.