బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మే 2022 (12:35 IST)

హైదరాబాద్ నగరంలో భారీగా గంజాయి పట్టివేత

ganja
ఇటీవలికాలంలో హైదరాబాద్ నగరం డ్రగ్స్‌ హబ్‌గా మారుతోంది. అనేక డ్రగ్స్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
నగరంలోని పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగు రోడ్డులో కెన్నాబిస్ అనే గంజాయిని హయత్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ గోదావరి ఏజెన్సీ ఏరియా నుంచి హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నట్టు పోలీసులకు వచ్చిన సమాచారంతో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీ మొత్తంతో గంజాయితో పాటు పది మంది సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
వీరిలో ఇద్దరు యువతులు కూడా ఉండటం గమనార్హం. ఔటర్ రింగు రోడ్డులో ఒక కారులో తీసుకొచ్చిన గంజాయిని మరో కారులోకి మారుస్తుండగా పోలీసులు గుర్తించి చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం 470 కేజీల గంజాయితో పాటు నాలుగు కార్లు, రెండు లక్షల రూపాయల నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.