సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (15:09 IST)

భార్యపై అనుమానం.. ప్రైవేట్ పార్ట్‌లో కత్తితో పొడిచి హత్య

murder
భార్యపై అనుమానం హత్యకు దారితీసింది. కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ టిఫిన్ సెంటర్‌లో పని చేస్తున్న సరిత యాదవ్ అనే మహిళను ఆమె భర్త సంతోష్ తన ఇంట్లో ప్రైవేట్ పార్ట్‌లో కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డువచ్చిన మృతురాలు బంధువు పై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు.
 
గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రి కీ తరలించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్నాడు.