శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (08:58 IST)

భార్య అక్రమ సంబంధం పెట్టుకోలేదనీ చంపి కాల్చి ఉడకబెట్టిన భర్త?

murder
పాకిస్థాన్ దేశంలో దారుణం జరిగింది. ఈ దేశంలోని సింధ్ ప్రావిన్స్‌లో కట్టుకున్న భార్య అక్రమం సంబంధం పెట్టుకోలేదన్న అక్కసుతో కసాయి భర్త తన ఆరుగురు పిల్లల ముందే భార్యను చంపేశాడు. అప్పటికీ కసితీరకపోవడంతో భార్య శవాన్ని ముక్కలుగా చేసి వాటిని కాల్చి ఉడకబెట్టాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో సంచలనం రేపింది. నగరంలోని గుల్షన్ ఏ ఇక్బాల్ ప్రాంతంలో ఓ ప్రైవేటు స్కూలులోని వంట గదిలో నర్గీస్ మృతదేహాన్ని ఉడకబెట్టడాన్ని పోలీసులు కనుగొన్నారు. 
 
పోలీసుల కథనం మేరకు... బజౌర్ ఏజెన్సీకి చెందిన మహిళ భర్త అషిక్ పాఠశాలలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ పాఠశాల గత 9 నెలలుగా మూతబడివుంది. అయితే, ఆర్థిక కష్టాల్లో చిక్కుకోవడంతో భార్యను మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని భర్త బలవంతం చేశాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన భర్త ఆమెను ఆరుగురు పిల్లల ఎదుటే కొట్టి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని ముక్కలు చేసి కాల్చి ఉడకబెట్టాడు. 
 
ఈ దారుణానికి పాల్పడిన తర్వాత ముగ్గురు పిల్లలతో అక్కడ నుంచి పారిపోయాడు. తండ్రి పారిపోయిన తర్వాత మృతురాలి 15 యేళ్ల పెద్ద కుమార్తె పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.