ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (08:21 IST)

'చిరంజీవి'గా 44 సంవత్సరాలు.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి గురువారం తన జీవితంలో ఓ కీలక ఘట్టాన్ని తన అభిమానులకు గుర్తు చేశారు. ఇదే అంశంపై ఆయన ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చశారు. తన అసలు పేరు స్థానంలో చిరంజీవి పేరు మొదలుపెట్టిన తన ప్రయాణం గురువారం సెప్టెంబరు 22వ తేదీనతో 44 యేళ్లు పూర్తి చేసుకుంటుంది అని తెలిపారు. వెరసి చిరంజీవిగా 44 యేళ్ళ ప్రస్థానాన్ని ఆయన పూర్తిచేశారు. 
 
గత 1978లో సెప్టెంబరు 22వ తేదీన తాను నటించిన "ప్రాణం ఖరీదు" చిత్రం ప్రేక్షకుల ముందుక వచ్చిందని, ఆ సినిమాతోనే తన పేరు చిరంజీవిగా మారిందన్నారు. మీకు తెలిసిన ఈ చిరంజీవిగా.. చిరంజీవిగా పుట్టిన రోజు సెప్టెంబరు 22వ తేదీ అని ఆయన తెలిపారు. 
 
"ప్రాణం ఖరీదు" చిత్రంతో తనకు చిరంజీవిగా ప్రాణం పోసి, అన్నీ మీరే అయి గత 44 యేళ్లుగా నన్ను నడిపించారంటూ ఆయన తెలిపారు. తనను ఇన్నేళ్లుగా ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానల రుణం ఈ జన్మకు తీర్చుకోలేని అని మెగాస్టార్ చిరంజీవి ఓ భావోద్వేగ పోస్టును చేశారు.