గాడ్ ఫాదర్‌లోని మెగాస్టార్స్ చిరంజీవి, సల్మాన్ కోసం నిరీక్షణ ఫలిస్తుందా!
గాడ్ ఫాదర్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్‌ఖాన్‌లు కలిసి ఓ డాన్స్‌లో నర్తించారు. తార్‌మార్ థక్కర్‌మార్ లిరికల్ వస్తుందని ఇటీవలే ప్రకటించారు. కానీ ఆడియో ఫైల్ విడుదల చేశారు. కొన్ని సాంకేతిక కారణాలవల్ల అనుకున్న టైంకు విడుదలచేయలేకపోయామని ఆ తర్వాత ట్విట్టర్‌లో చిరంజీవి పేర్కొన్నారు. ఇప్పుడు ఇక నిరీక్షణ ముగిసింది అంటూ ఓ కాప్షన్‌తో చిరంజీవి పోస్ట్ చేస్తూ సెప్టెంబర్ 21న సాయంత్రం 4గగంటల 5 నిముషాలకు విడుదలవుతుందని పోస్టర్ ద్వారా తెలియజేశారు.
కాగా, నిన్ననే విడుదలైన ఈ సినిమాలోని చిరంజీవి డైలాగ్ పెద్ద వైరల్ అయింది. అందుకు కారణం రాజకీయాల గురించి ఆయన చెప్పిన డైలాగ్. నేను రాజకీయంకు దూరంగా వున్నాను. కానీ నానుంచి రాజకీయం దూరం కాలేదు. అన్న మాటలు సినిమాలోని ఓ సందర్భంలో చెప్పేవి. కానీ ఆయన అభిమానులు బయట త్వరలో రాజకీయాల్లోకి వస్తారంటూ కొందరు కామెంట్లు చేస్తూ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలోని ఇద్దరు స్టార్స్ డాన్స్ చేసిన సాహిత్యం పెద్దగా ఆకట్టుకులేకపోయిందనీ, సల్మాన్ ఖాన్ లాంటి హీరోను సరిగ్గా ఉపయోగించుకోలేదని ఫిలింనగర్‌లో వార్త వినిపిస్తోంది. మరి ఇంతకాలం ఇద్దరు మెగాస్టార్ల కోసం చేసిన నిరీక్షణ ఫలిస్తుందా లేదో దసరాకు చూడాల్సిందే.