వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం కృష్ణ వ్రింద విహారి'. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ విలేఖరుల సమావేశంలో కృష్ణ వ్రింద విహారి' విశేషాలు పంచుకున్నారు.
ఈ సినిమా కోసం నాగశౌర్యని ఎప్పుడు కలిశారు ?
నాగశౌర్య గారికి 2020లో ఈ కథ చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. ఆయన హోమ్ బ్యానర్ లోనే ఈ కథ చేయాలని నిర్ణయించారు.
నాగశౌర్య స్వతహగా రచయిత కదా.. ఆయన్ని ఎలా ఒప్పించారు ?
చాలా బలమైన కథ ఇది. నిజానికి హీరోలకు కథని నేను నెరేట్ చేయను. నెరేషన్ లో నేను కొంచెం వీక్(నవ్వుతూ) నా సహాయ దర్శకుడితో చెప్పిస్తుంటాను. కాని తొలిసారి ఈ కథని శౌర్యగారికి నేనే చెప్పాను. కథలో వున్న బలం అలాంటిది. నేను చెప్పినా ఓకే అవుతుందనే నమ్మకంతో చెప్పాను. నేను చెప్పినప్పుడే ఆయనకు చాలా నచ్చేసింది.
కృష్ణ వ్రింద విహారి' వుండే యూనిక్ పాయింట్ ఏంటి ?
ఇప్పటివరకూ ఇందులో వున్న యూనిక్ పాయింట్ ని ఇంకా రివిల్ చేయలేదు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో కథపై ఒక అవగాహన ఇస్తాం. అయితే ఈ కథకి మూలం చెప్తాను. నాకు బాగా కావాల్సిన సన్నిహితుడు జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఫ్రేమ్ చేసుకున్న కథ ఇది. ఈ పాయింట్ చాలా ఎంటర్ టైనర్ గా వుంటుంది. ప్రేక్షకులు హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తారు.
బ్రాహ్మణ పాత్రలో ఇటివలే ఒక హీరో చేశారు కదా.. చాలా తక్కువ కాలంలోనే మళ్ళీ మీరు అదే పాత్రతో వస్తున్నారు.. ఫ్రెష్ నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
మీరు చెబుతున్న 'అంటే సుందరానికీ'' సినిమా నేను చూశాను. నాని గారికి ఒక ప్రత్యేక శైలి వుంది. ఆయనే కాదు.. అల్లు అర్జున్ గారు డీజే, ఎన్టీఆర్ గారు అదుర్స్, కమల్ హాసన్ గారు మైకేల్ మదన్ కామరాజు ఇలా ఎవరి స్టయిల్ వారికి వుంటుంది. నాగశౌర్య గారికి కూడా ఒక యూనిక్ స్టయిల్ వుంది. ఆయనలో ఒకరకమైన అమాయకత్వం, క్యూట్ నెస్, కొంటెతనం, అల్లరి వుంటుంది. కృష్ణ పాత్రకు నాగశౌర్య యాప్ట్. ఇందులో నేను ఎంచుకున్న నేపధ్యం కూడా ఆచార్యులు. శౌర్యగారిని చూడగానే ఆ ఛార్మ్ కనిపించింది. అందుకే కథ పూర్తయిన తర్వాత మొదట శౌర్యగారినే కలిశాను. ఆయనకీ చాలా గొప్పగా నచ్చింది.
పాదయాత్ర ఆలోచన ఎవరిది ?
నాగశౌర్యగారిదే. ఈ సినిమా ఆయనకి చాలా నమ్మకాన్ని కలగజేసింది. ఆయన ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేశారు. ఆ ఆనందం ప్రేక్షకులు కూడా పొందాలని ఆయనే స్వయంగా జనాల్లోకి వెళ్లారు. పాదయాత్రకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత సినిమాపై బజ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది.
కామెడీని డీల్ చేయడం కష్టం.. కానీ మీ మొదటి అలా ఎలా ని చాలా వినోదంగా తీశారు.. ఇందులో వినోదం ఎలా వుంటుంది.
'అలా ఎలా' ని చాలా స్వేఛ్చగా తీశాను. ప్రేక్షకులకు చాలా నచ్చింది. కృష్ణ వ్రింద విహారి'లో కూడా హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ వుంటుంది. నాగశౌర్యతో పాటు బ్రహ్మాజీ , రాహుల్ రామకృష్ణ, సత్య, వెన్నెల కిషోర్ పాత్రలు మంచి వినోదాన్ని పంచుతాయి. సినిమాని ప్రేమించి తీస్తే ఎలా వుంటుందో ఈ సినిమాతో చూస్తారు.
సంగీతం గురించి చెప్పండి?
మహతి సాగర్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. నేను శౌర్య లెక్కలేనన్ని సార్లు ఈ సినిమా చూశాం. ఎన్నిసార్లు చూసిన చూడాలనిపిస్తూనే వుంది. ఛలో కంటే ఎక్కువసార్లు చూశానని నాగశౌర్య చెప్పారు. చాలా మంచి కంటెంట్ వున్న సినిమా ఇది. అందుకే శౌర్యగారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి పాదయాత్ర చేపట్టారు.
షిర్లీ సెటియా పాత్ర గురించి ?
ఈ కథ చాలా ఫ్రెష్ గా వుంటుంది. ఒక ఫ్రెష్ ఫేస్ కావాలని ముందే భావించాం. ఇందులో తను నార్త్ ఇండియా నుండి హైదరాబాద్ లో స్థిరపడిన అమ్మాయిగా కనిపిస్తుంది. ఈ కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకం. బయటికి సరదాగా కనిపిస్తున్నా ఇంటర్నల్ గా తనకి ఒక ఇష్యూ వుంటుంది. ఈ కథలో అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది.
కంటెంట్ బావుంటేనే ప్రేక్షకులు థియేటర్ కి వస్తున్నారు.. మీ కంటెంట్ పట్ల ఎంత నమ్మకంగా వున్నారు? రిలీజ్ టెన్షన్ ఉందా ?
కంటెంట్ మాకు పూర్తి నమ్మకం వుంది. బయటవాళ్ళు కూడా చూసి చాలా పాజిటివ్ గా స్పందించారు. నిన్ననే సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుండి చాలా మంచి ప్రశంసలు వచ్చాయి.'' చాలా కాలం తర్వాత మంచి ఫ్యామిలీ మూవీ చూశాం. సినిమా చుస్తున్నంత సేపు నవ్వుతూనే వున్నామని'' చెప్పారు.
మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎనిమిదేళ్ళు అవుతుంది. కానీ మూడు సినిమాలే చేశారు. ఇకపైన వేగం పెంచుతారా ?
ఖచ్చితంగా. నాకు ఇండస్ట్రీ నేపధ్యం లేదు. అంతకుముందు సినిమాలకి కూడా పని చేయలేదు. నా మొదటి సినిమా నిర్మాత నా స్నేహితుడే కావడం వలన చాలా సులువుగానే దర్శకుడిగా పరిచయమయ్యా. ఇండస్ట్రీ ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా. ఈ అనుభవంతో ఇకపై చక్కని ప్లానింగ్ తో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తా.
కొత్తగా చేయబోయే సినిమాల గురించి ?
కొన్ని కథలు రెడీ చేస్తున్నా. ఒక డార్క్ హ్యుమర్ కథ రెడీ అవుతోంది. అలాగే గాడ్ ఫాదర్, దళపతి స్టయిల్ లో యాక్షన్ ఎమోషనల్ మూవీ చేయాలని వుంది.