గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (17:53 IST)

నాగ శౌర్య కృష్ణ వ్రింద విహారి టైటిల్ సాంగ్ విడుదల

Naga Shaurya,  Shirley Setia
Naga Shaurya, Shirley Setia
హీరో నాగశౌర్య , అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణ వ్రింద విహారి' చిత్రంలో రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. బ్రాహ్మణ కుర్రాడిగా, ఉద్యోగం మీద నగరానికి వచ్చిన తర్వాత  అర్బన్ కుర్రాడిగా అలరించనున్నాడు. ట్రైలర్‌ లో తన నటనతో అదరగొట్టాడు నాగశౌర్య. ఈరోజు చిత్ర బృందం టైటిల్ సాంగ్‌ని లాంచ్ చేసింది.
 
ఈ పాటలో నాగ శౌర్య ఒక ఇరకాట పరిస్థితిలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. అతని ప్రేమలో సమస్య తో పాటు కుటుంబంతో కూడా చిక్కొచ్చింది. అంతేకాకుండా వెన్నెల కిషోర్ కోమా నుండి మేల్కొలపడానికి ఎదురు చూస్తున్నాడు నాగ శౌర్య .
 
దర్శకుడు అనీష్ కృష్ణ అండ్ టీమ్ ఈ సాంగ్‌ని హిలేరియస్ గా ప్రజంట్ చేశారు. మహతి స్వర సాగర్ క్యాచి నెంబర్ ని స్కోర్ చేయగా, రామ్ మిరియాల  ఎనర్జిటిక్ గా పాడారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకట్టుకుంది.
ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శౌర్య తల్లిగా అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ కనిపించనున్నారు.
శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటర్
‘కృష్ణ వ్రింద విహారి' సెప్టెంబర్ 23న విడుదల కానుంది.
 
తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు