గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (14:52 IST)

నాగశౌర్య కృష్ణ వ్రింద విహారి టీమ్ పాదయాత్ర

Krishna Vrinda Vihari Team Padayatra
Krishna Vrinda Vihari Team Padayatra
వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.  సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది.
 
ఈ సినిమా పాటలు, టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి  ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతూ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.
 
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ పాదయాత్రకు శ్రీకారం  చుట్టింది.  సెప్టెంబర్ 14 - తిరుపతి, సెప్టెంబర్ 15 - నెల్లూరు, ఒంగోలు, సెప్టెంబర్ 16 - విజయవాడ, గుంటూరు, ఏలూరు, సెప్టెంబర్ 17 - భీమవరం, రాజమండ్రి,  సెప్టెంబర్ 18 - కాకినాడ , వైజాగ్ లో హీరో నాగశౌర్యతో పాటు చిత్ర యూనిట్ పాదయాత్ర నిర్వహించి ప్రేక్షకులు, అభిమానులని కలసి సందడి చేయనుంది.
అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు