శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (17:09 IST)

ఉక్రెయిన్‌పై 75 క్షిపణులను ప్రయోగించిన రష్యా సైన్యం

blast
రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై 75 క్షిపణులను ప్రయోగించింది. గత కొన్నివారాలుగా ప్రశాంతంగా ఉన్న ఉక్రెయిన్‌లో రష్యాలో 8 రాజధాని కీవ్‌ను కూడా కొన్ని క్షిపణులు తాకినట్టు వెల్లడైంది. 
 
భారీ శబ్దాలతో కీవ్ దద్దరిల్లింది. ఇలా ఉక్రెయిన్‌లో చోటుచేసుకున్న బహుళ పేలుళ్లలో 8 మంది పౌరులు మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. క్రిమియాను రష్యాకు కలిపే వంతెనపై పేలుడుకు ఉక్రెయిన్ కారణమని మాస్కో ఆరోపించిన ఒక రోజు తర్వాత పేలుళ్లు సంభవించాయి, ముగ్గురు వ్యక్తులు మరణించారు.
 
రష్యా ప్రయోగించిన వాటిలో సగం క్షిపణులను తమ బలగాలు గగనతలంలోనే నిరోధించాయని జలూజ్నీ చెప్పారు. 
 
అటు, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ కూడా రష్యా తాజా దాడులపై స్పందించారు. దేశంలోని అనేక నగరాలు రష్యా క్షిపణి దాడులకు గురయ్యాయని తెలిపారు.