శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2023 (16:44 IST)

బ్యాంకులకు ఐదు రోజుల పాటు సెలవులు.. ఎప్పుడంటే?

bank holiday
బ్యాంకులు ఈ నెల వరుసగా ఐదు రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ నెల 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు సెలవు వుంటుంది. 
 
ఆపై 27వ తేదీన బ్యాంకులు పనిచేస్తాయి. తర్వాత 28 నాలుగో శనివారం, 29 ఆదివారం కావడంతో సెలవు వుంటుంది. ఇక బ్యాంక్ ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మెకు వెళ్లనున్నారు. దీంతో జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె ప్రకటించారు. 
 
ఐదు పనిరోజులు, పెన్షన్ అప్డేట్స్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు, వేతన సవరణ డిమాండ్లతో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె ప్రకటించారు. దీంతో ఈ నెల 26వ తేదీ నుంచి 31 వరకు మొత్తం ఆరు రోజుల్లో కేవలం రోజులు బ్యాంకులు పని చేయవు.