సోమవారం, 27 మార్చి 2023
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 6 అక్టోబరు 2022 (18:41 IST)

బ్యాంకు యాప్‌లు వాడుతున్నారా.. ‘సోవా’ వైరస్‌తో జాగ్రత్త

cyber hackers
బ్యాంకు యాప్‌లు వాడుతున్నారా.. అయితే జాగ్రత్త పడండి. ఈ యాప్‌ల ద్వారా ఫోన్‌లో చొరబడి, డబ్బులను ఖాళీ చేసే ‘సోవా’ వైరస్ దాడి చేస్తోందని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. 
 
కొన్ని రకాల గేమింగ్ యాప్స్, ఫోన్ స్పీడ్ చేసే యాప్‌లు, ఆన్‌లైన్ లింకులను క్లిక్ చేయడం ద్వారా ఈ వైరస్ స్మార్ట్ ఫోన్లలో చొరబడుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్‌లో అనవసర, థర్డ్ పార్టీ యాప్స్ ఏవైనా ఉంటే వెంటనే తొలగించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
 
హ్యాకర్లు బ్యాంకుల నుంచి వచ్చినట్టుగా వివిధ రకాల ఆఫర్ల పేరిట మెసేజీలు, వాట్సాప్ లింకులను పంపుతున్నారు. వాటిని క్లిక్ చేస్తే సోవా వైరస్ మన ఫోన్ లోకి చొరబడి తిష్టవేస్తుంది. 
   
అందుకే ఈ-మెయిల్, ఎస్సెమ్మెస్, వాట్సాప్‌లలో ఆఫర్ల పేరిట వచ్చే ఎటువంటి లింకులపై క్లిక్ చేయవద్దు. కేవలం గూగుల్ ప్లేస్టోర్ వంటి అధికారిక స్టోర్‌లు, వెబ్ సైట్ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవాలి.