బ్యాంకులకు మరో ఐదు రోజులు సెలవులు
ప్రస్తుత నెలలో ఇప్పటికే 15 రోజుల సమయం గడిచిపోయింది. మరో 15 రోజులు మాత్రమే మిగిలివున్నాయి. అయితే, ఈ మిగిలిన రోజుల్లో బ్యాంకులకు మరో ఐదు రోజులు సెలవులు రానున్నాయి. అంటే బ్యాంకులు కేవలం 9 రోజులు మాత్రమే పని చేయనున్నాయి. ఈ ఐదు సెలవులతో కలుపుంటే సెప్టెంబరు నెలలో బ్యాంకులకు ఏకంగా 13 రోజుల పాటు సెలవులు. వీటిలో ఇప్పటికే ఎనిమిది సెలవులు ముగిసిపోయాయి.
మిగిలిన 15 రోజుల్లో ఈ నెల 18వ తేదీన ఆదివారం, 21వ తేదీన శ్రీ నారాయణ గురు సమాధి దివస్, 24వ తేదీన నాలుగో శనివారం, 25వ తేదీన ఆదివారం, 26వ తేదీన నవరాత్రి స్థాపనల సందర్భంగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అయితే, ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించదనే విషయం బ్యాంకు ఖాతాదారులు గమనించాలి.