శుక్రవారం, 19 జులై 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (15:07 IST)

5 రోజులు బ్యాంకులకు సెలవులు

bank holiday
బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలెర్ట్. బ్యాంకులకు ఐదు రోజులు సెలవులు ప్రకటించారు. వారాంతపు సెలవులతో పాటు పండుగుల కూడా ఒకేసారి రావడంతో బ్యాంకులకు ఈ వారం వరుసగా ఐదు రోజులు సెలవులు వచ్చాయి. ఆగష్టు నెలలో మొత్తంగా 19 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. 
 
ఇందులో 5 వారాంతపు సెలవులు ఉండగా.. మిగిలిన 13 పండుగ సెలవులు వచ్చాయి. అయితే ఈ సెలవులు కూడా ప్రాంతాల వారీగా మారుతున్నాయి. అయితే ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ క్లోజ్ కానున్నాయి.
 
ఇక ఈ వారం వరుసగా 5 రోజులు బ్యాంకుల సెలవులు పరిశీలిస్తే..
ఆగష్టు 11- రక్షాబంధన్( అహ్మదాబాద్, భోపాల్, డెహ్రాడూన్, జైపూర్, షిమ్లా)
ఆగష్టు 12 - రక్షాబంధన్( కాన్పూర్, లక్నో)
ఆగష్టు 13 - రెండవ శనివారం
ఆగష్టు 14 - ఆదివారం
ఆగష్టు 15- ఇండిపెండెన్స్ డే