శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఆగస్టు 2022 (14:25 IST)

ఆగష్టు 7న ఎస్ఐ ఉద్యోగాలు-ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్

telangana govt
తెలంగాణ రాష్ట్రంలో 80వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఇందులో 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగా, ఆగష్టు 7న ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది.
 
ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం జరగనున్న ఈ పరీక్షకు హైదరాబాద్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో 503, రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 35 కలిపి మొత్తం 538 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 
శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలతో ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ గడువు ముగిసింది. 554 ఎస్సై పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 2,47,217 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.