శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (19:21 IST)

గోడపై బల్లి కనిపించింది.. గన్‌తో షూట్ చేశాడు.. అంతే బాలుడిపై?

Lizard
గోడపై బల్లి కనిపించడంతో ఒక వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటన హైదరాబాద్‌ పాతబస్తీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మొఘల్‌పురాలోని సుల్తాన్‌షాహీలో ఓ వ్యక్తి గోడ మీది బల్లిపై కాల్పులకు పాల్పడ్డారు. సుల్తాన్‌షాహీకి చెందిన అఫ్సర్‌ అనే వ్యక్తి ఈ నెల 1న తన ఇంట్లో గోడ మీద ఉన్న బల్లిపై గన్‌తో కాల్పులు జరిపారు.
 
అయితే ఆ బుల్లెట్‌ గోడకు తగలడంతో కొంత పెచ్చు ఊడి అక్కడే ఉన్న ఆజాన్‌ అనే ఎనిమిదేళ్ల బాలుడిపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని స్థానికులు దవాఖానకు తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఏ ఆయుధంతో కాల్పులు జరిపారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.