గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (09:29 IST)

హైదరాబాబాద్ పటాన్ చెరువులో విషాదం - ముగ్గురి ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలోని పటాన చెరువులో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మృతులను రేఖ (28), రేఖ కుమార్తె (2), రేఖ మరిది బాసుదేవ్ (27)గా గుర్తించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, వీరంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు కావడం గమనార్హం. 
 
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. కానీ, పోలీసులు మాత్రం అక్రమ సంబంధం కూడా కారణమైవుండొచ్చని అనుమానిస్తున్నారు. అందుకే కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.