గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (20:11 IST)

సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె ఉమ మహేశ్వరిది ఆత్మహత్యే : పంచనామా రిపోర్టు

NTR Daughter
ఇటీవల అనారోగ్యాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్న సీనియర్ ఎన్టీఆర్ ఉమా మహేశ్వరిది ఆత్మహత్యేనని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యులు జూబ్లీహిల్స్‌ పోలీసులకు అందించిన నివేదికలో ఈ మేరకు పేర్కొన్నారు. 
 
ఈ నెల ఒకటో తేదీన ఉమా మహేశ్వరి తన గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఆమె చనిపోయివుండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
 
ఆ తర్వాత ఉమా మహేశ్వరి కూమార్తె దీక్షిత నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గదిలోకి వెళ్లి, భోజన సమయానికి బయటికి రాకపోవడంతో పిలిచామని.. ఎంతకీ తలుపు తీయకపోవడంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించినట్లు దీక్షిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
అయితే, గత కొంతకాలంగా ఒత్తిడికి గురవడంతో పాటు అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి బాధపడుతున్నట్లు దీక్షిత పోలీసులకు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలోనూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వైద్యులు తేల్చారు. ముందుగా ఉమా మహేశ్వరిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఆత్మహత్యగా మార్చి విచారణ జరుపుతున్నారు.