సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (16:41 IST)

అమెరికా ఆర్థికవేత్తలకు నోబెల్ పురస్కారం

economics nobel
ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారం అమెరికాకు చెందిన ముగ్గురు ఆర్థిక వేత్తలకు వరించింది. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడెమీ సోమవారం ప్రకటించింది. ఆ ప్రకటనలో ఈ యేడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికారు చెందిన బెన్ ఎస్ బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ హెచ్.డిబి‌విగ్‌లకు అందించినున్నట్టు అకాడెమీ తన ప్రకటనలో పేర్కొంది. బ్యాంకులు ఆర్థిక సంక్షోభంపై జరిగిన పరిశోధనలకుగాను వీరిని ఈ యేడాది నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు తెలిపింది. 
 
ఈ ముగ్గురూ ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో బ్యాంకుల పాత్రపై కీలక పరిశోధనలు జరిపారు. బ్యాంకుల పతనాన్ని నివారించడం ఎందుకు ముఖ్యం? అనేది వారి పరిశోధనల్లో ముఖ్యాంశం. బ్యాంకులు ఎందుకు ఉన్నాయి? ఆర్థిక సంక్షోభాల సమయంలో వాటిపై తక్కువ ప్రభావం పడేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? బ్యాంకుల పతనాలు.. ఆర్థిక సంక్షోభాలకు ఏ విధంగా దారితీస్తాయి? తదితర ఆధునిక బ్యాంకింగ్ పరిశోధనలకు ఈ ముగ్గురు ఆర్థికవేత్తలు 1980ల్లోనే పునాదులు వేశారు.
 
ఆర్థిక మార్కెట్లను నియంత్రించడంలో, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడంలో వారి విశ్లేషణలు ఆచరణాత్మక ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. డిపాజిట్లు, డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌లు, బ్యాంకు రుణాల విషయంలో డైమండ్‌, డైబ్‌విగ్‌ పరిశోధనలు బ్యాంకులకు ఎంతో మేలు చేశాయి. పురస్కార గ్రహీతల విశ్లేషణలు.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలు, బెయిలవుట్‌లను నివారించగల సామర్థ్యాన్ని మెరుగుపరిచాయని నోబెల్‌ ప్రైజ్ కమిటీ ఛైర్మన్‌ టోర్ ఎల్లింగ్‌సెన్ చెప్పారు.