గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 అక్టోబరు 2022 (16:48 IST)

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

nobel prize physics
భౌతిక శాస్త్రంలో ఈ యేడాది ముగ్గురు శాస్త్రవేత్తలు నోబెల్ పురస్కారాన్ని పంచుకున్నారు. క్యాంటమ్ ఫిజిక్స్‌లో వినూతన్న ఆవిష్కరణలు చేసినందుకుగాను వీరికి ఈ బహమతి దక్కింది. ఈ పురస్కారాన్ని గెలుచుకున్నవారిలో అలైన్ ఆస్పెక్ట్, క్లాసెర్, జెల్లింగర్‌లు ఉన్నారు. వీరికి 7.34 కోట్ల రూపాయల నగదు బహుమతిని అందజేయనున్నారు. 
 
క్వాంటమ్ సమాచార శాస్త్రానికి కొత్తదారులు తెరుస్తూ, బెల్ అసమానతలకు అతీతంగా ఫోటాన్లతో వారు సాగించిన పరిశోధనలకు ఈ యేడాది నోబెల్ బహుమతి ఇస్తున్నామని రాయల్ స్వీడిష్ అకాడెమీ ప్రకటించింది.
 
2022 సంపత్సరానికి ఈ బహుమతులు గెలుచుకున్న శాస్త్రవేత్తల్లో అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసెర్, ఆంటోన్ జెల్లింగర్‍లు ఉన్నారు. రెండు కణాలను ఒకదానికొకటి వేరుపడినప్పటికీ పరస్పరం ఎంతో దూరంగా ఉన్నప్పటికీ అవి రెండూ ఏకశక్తిగా వ్యవహరించడాన్ని ఈ శాస్త్రవేత్తలు త్రయం కనుగొంది. ఈ సమాచారం ఆధారంగా సరికొత్త క్వాంటం టెక్నాలజీకి ఈ ఫలితాలు బాటలు వేశాయని తెలిపింది.