శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (08:35 IST)

కరోనా వైరస్‌ను కనిపెట్టే మాస్క్.. ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు!

Mask
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుంది. గత 2019లో వెలుగు చూసిన ఈ వైరస్ ఇపుడు ఓ సీజనల్ మహమ్మారిగా మారిపోయింది. ఈ వైరస్ బారినపడిన బాధితుల్లో లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటికీ పలు దేశాలు ఈ వైరస్ గుప్పిట్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ను గుర్తించి మాస్క్‌ను కనిపెట్టారు. 
 
మన చుట్టూ ఉండే వాతావరణంలో కరోనా సహా పలు రకాల వైరస్‌ల ఉనికిని గుర్తించి అప్రమత్తం చేసే సరికొత్త వైర్‌లెస్ మాస్కును చైనా పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. 
 
దీన్ని అప్టేమర్స్ అనే సింథటిక్ అణువులతో తయారు చేసి, దీనికి ప్రత్యేక బయోసెన్సర్‌ను మాస్కులో వారు పొందుపరిచారు. వాతావరణంలో కరోనా, ఇన్‌ఫ్లుయెంజా వంటి వైరస్‌లను అది కేవలం 10 నిమిషాల్లో నిర్ధారిస్తుంది. ఈ మాస్కును ధరించిన వ్యక్తి ఫోనుకు సంబంధిత సమాచారాన్ని చేరవేస్తుంది.