సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 అక్టోబరు 2022 (13:50 IST)

గొప్ప ఐడియాలు బాత్రూమ్‌లోనే ఎందుకు వస్తాయి?

cold water bath
చాలా మందికి మరుగుదొడ్డిలో ఉన్నపుడు, మరికొందరికి బాత్రూమ్‌లో స్నానం చేస్తున్నపుడే మంచి మంచి గొప్ప ఐడియాలు వస్తుంటాయి. కేవలం బాత్రూమ్‌లో ఉన్నపుడు మాత్రమే ఇలాంటి ఐడియాలు ఎందుకు వస్తాయన్న అంశంపై వర్జీనియా విశ్వవిద్యాలయంలో కాగ్నిటివ్ సైన్స్ ఫిలాసఫీలో పరిశోధకుడు జాక్ ఇర్వింగ్ ఓ అధ్యయనం చేపట్టాడు. 
 
వేసవి కాలంలో చల్లటి నీరు, చలికాలంలో షవర్ నుంచి జాలువారే వెచ్చటి నీరు మీ మనసులో నూతన ఆలోచనలకు ప్రేరణ కల్పిస్తాయని, ఇలా కలగడానికి కారణం షవర్ ప్రభావం అని చెప్పారు. 
 
ఒక సమస్యకు పరిష్కారం కనుగొనడానికి నిరంతరం శ్రమించడం కంటే విరామం తీసుకోవడం మంచిదన్నారు. లేదా కాసేపు వేరే పని చేయాలని సలహా ఇచ్చారు. బాత్రూమ్‌లో స్నానం ప్రారంభించినపుడు అక్కడి వాతావరణం మీ మనస్సును ఖాళీగా మారుస్తుందన్నారు. 
 
అపుడు ఏకాగ్రత పని లేకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటారు. అలాంటపుడు మంచి ఆలోచనలు వచ్చేందుకు అవకాశం ఉందని తెలిపారు. బోరింగ్ పనిని నిరంతరం చేస్తుంటే, సృజనాత్మక దెబ్బతింటుంది. మంచి ఆలోచనలు కొరవడతాయి. 
 
ఉదాహరణకు నడక, తోటపని, స్నానం చేయడం మొదలైన తక్కువ స్థాయి ఒత్తిడిని కలిగిస్తాయి. ఫలితంగా సృజనాత్మకత పెరుగుతుంది. ఈ అధ్యయనం, ఇటీవలే సైకాలజీ ఆఫ్ ఈస్తటిక్స్, క్రియేటివిటీ అండ్ ది ఆర్ట్స్‌లో ప్రచురితమైంది.